News February 19, 2025

NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.

Similar News

News December 6, 2025

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: జిల్లా జడ్జి శ్రీవాణి

image

డిసెంబర్ 21, 2025న నిర్మల్ జిల్లాలో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి శ్రీవాణి అన్నారు. వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్ కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లపై శనివారం నిర్మల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల తదితరులు పాల్గొన్నారు.

News December 6, 2025

కరీంనగర్‌: అంబేడ్కర్‌కు బండి సంజయ్ నివాళి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News December 6, 2025

రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుంది: నిర్మల

image

రూపాయి పతనంపై కేంద్ర మంత్రి నిర్మల స్పందించారు. రూపాయి తన స్థాయిని తానే కనుగొంటుందని అన్నారు. ఈ పతనం ప్రతికూలం కాదని, ఎగుమతిదారులకు ప్రయోజనకరమని చెప్పారు. ‘రూపాయి, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్ల వంటివి చాలా సెన్సిటివ్ అంశాలు. మేం ప్రతిపక్షంలో ఉండగా నిరసనలు చేశాం. కానీ అప్పట్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేది. ఇప్పుడు ఎకానమీ ఏ పొజిషన్‌లో ఉందో చూడండి’ అని HT సమ్మిట్‌లో అన్నారు.