News March 20, 2025
NLG: ఎంబ్రాయిడరీ వర్క్‌లో మహిళలకు ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మార్చి 24 నుంచి మగ్గం వర్క్ (ఎంబ్రాయిడెరీ)లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 సంవత్సరాలలోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 24, 2025
కట్టంగూరు డీటీపై బదిలీ వేటు

కట్టంగూరు డీటీ జే.సుకన్యపై బదిలీ వేటు పడింది. అన్నారంలోని రామ్మూర్తి అనే రైతుభూమిని ఆమె వేరే వారి పేరు మీద బదిలీ చేసింది. బాధితుడు రామ్మూర్తి ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరిపారు. తప్పు తేలడంతో డీటీపై చర్యలు తీసుకున్నారు. సుకన్యను నల్గొండ కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు.
News April 24, 2025
NLG: రిసోర్స్ పర్సన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు మండల, జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్ల కోసం అర్హత, ఆసక్తిగల ఉపాధ్యాయులు ఈ నెల 24న దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ భిక్షపతి తెలిపారు. ఎంపికైన వారి వివరాలు ఈ నెల 28న ప్రకటిస్తామని పేర్కొన్నారు. వివరాలకు క్వాలిటీ కోఆర్డినేటర్ ఆర్.రామచంద్రయ్యను, సెల్ నంబర్ 79955 67558ను సంప్రదించాలని సూచించారు.
News April 24, 2025
రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులు

భూముల రికార్డులను సక్రమంగా నిర్వహించడం, వివాదాలను తగ్గించేందుకు ప్రతి గ్రామానికి ఒక గ్రామ పాలన అధికారిని ప్రభుత్వం నియమిస్తుందని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 10,590 మంది గ్రామ పాలన అధికారులను నియమిస్తున్నట్లు చెప్పారు. గురువారం మునుగోడులో జరిగిన భూభారతి అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. సర్వే సమస్యల పరిష్కారానికి 6000 మంది లైసెన్సుడ్ సర్వేయర్లను నియమించబోతుందని వెల్లడించారు.