News February 15, 2025

NLG: ఎక్కడ చూసినా అదే చర్చ..!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా WGL-KMM-NLG టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్ నడుస్తోంది. టీచర్ MLC ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, పులి సరోత్తంరెడ్డి, శ్రీపాల్ రెడ్డి పింగిళి, పూల రవీందర్ తదితర నేతల మధ్యపోటీ ఉంటుందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.

Similar News

News April 13, 2026

NLG: ఒకే సీజన్‌లో రెండోసారి వాత

image

కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లాలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ యాసంగి సీజన్‌లోనే రెండోసారి ధరలు పెరగగా, తాజాగా బస్తాకు 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అదనపు భారం పడింది. ఒక్క డీఏపీ, యూరియా మినహా పొటాష్ సహా మిగతా అన్ని రకాల ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులపై సుమారు 109.50 కోట్ల రూపాయల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది.

News April 13, 2026

నల్గొండ జిల్లాలో అమ్మాయిలదే హవా

image

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో NLG గత ఏడాది ఉన్న 68.84% ఉత్తీర్ణతను అధిగమించి, ఈసారి 73.69%తో అద్భుత ప్రగతిని కనబరిచింది. దీనివల్ల రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌లో గతేడాది 22వ స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా 12వ స్థానానికి ఎగబాకి తన సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలోనూ ఉత్తీర్ణత శాతం 57.99 శాతం నుంచి 62.81%కి పెరగడంతో పాటు ర్యాంకు మెరుగుపడటం విశేషం. జిల్లాలో రెండేళ్లుగా అమ్మాయిలదే హవా నడుస్తోంది.

News April 13, 2026

నల్గొండ: రీఛార్జ్‌తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

image

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్‌పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.