News May 24, 2024

NLG: ఎడ్ సెట్‌కు 331 మంది హాజరు

image

రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గురువారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిన నల్లగొండలోని ఎస్పీ ఆర్ పాఠశాల సెంటర్లో నిర్వహించిన టీఎస్ ఎడ్సెట్-2024 ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు రెండు విడతలుగా పరీక్షలు కొనసాగాయి. ఈ పరీక్షలకు 360 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 331 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు.

Similar News

News February 16, 2025

NLG: ఈ సండే.. చికెన్‌కు దూరమేనా?

image

ఆదివారం వచ్చిందంటే ఇండ్లల్లో నాన్-వెజ్ వంటలు ఘుమఘుమలాడుతుంటాయి. ఇక ఉమ్మడి NLG జిల్లాలో అయితే ఆదివారం చికెన్, మటన్ షాపుల ముందు క్యూలు కడతారు. వారం అంతా డ్యూటీలు, ఇతర పనులతో బిజి బిజీగా ఉండే జిల్లా వాసులు సండే ఓ ముక్క అలవాటుంటే సాయంత్రం ఓ చుక్క వేసుకుంటారు. అయితే బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న నేపథ్యంలో చికెన్ ప్రియులు ఈ ఆదివారం చికెన్‌కు దూరంగా ఉంటున్నారు.

News February 16, 2025

ధీరుని వీరత్వ చిహ్నం.. గొల్లగట్టు జాతర

image

తెలంగాణలో రెండో అతిపెద్ద జాతర పెద్దగట్టు లింగన్నజాతర. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే లింగమంతుల స్వామి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. వందల ఏళ్ల కింద తన జాతి ఉనికిని.. తమ వారి పశుసంపదను క్రూరమృగాల నుంచి, ఇతర తెగల నుంచి నిత్యం పోరాడుతూ కాపాడిన ధీరుని వీరత్వ చిహ్నమే ఈ జాతర. ఒ లింగా.. ఓ లింగా.. అంటూ జనం గుండెలు చేసే శబ్దాలతో ఐదురోజులు ఈ ప్రాంతం దద్దరిల్లుతుంది. మరి మీరు జారతకు వెళ్తున్నారా..?

News February 15, 2025

బొమ్మగాని ధర్మభిక్షం.. మూడు చోట్ల

image

బొమ్మగాని <<15471432>>ధర్మభిక్షం <<>>ఉమ్మడి NLG జిల్లాలో మూడు చోట్ల పోటీచేసి ప్రతీ చోటా విజయం సాధించారు. SRPT ద్విసభ్య నియోజకవర్గంగా ఉన్న సమయంలో 1952 ఎన్నికల్లో ధర్మభిక్షం PDF అభ్యర్థిగా పోటీచేసి జీఏరెడ్డి మీద, 1957లో జరిగిన ఎన్నికల్లో నకిరేకల్‌ అసెంబ్లీ స్థానం నుంచి PDFఅభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి KVరావుపై, 1962లో NLG నుంచి CPI అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ రవూఫ్‌పై విజయం సాధించారు.

error: Content is protected !!