News February 25, 2025

NLG: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

Similar News

News November 14, 2025

కామారెడ్డిలో చిల్డ్రన్స్ డే స్పెషల్ ‘కిడ్స్ విత్ ఖాకీ’

image

కామారెడ్డి జిల్లా పోలీస్‌ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే సందర్భంగా ‘కిడ్స్ విత్ ఖాకీ’ కార్యక్రమం శుక్రవారం నిర్వహించనున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 9:30 గంటలకు నిజాంసాగర్‌ చౌరస్తా వద్ద ట్రాఫిక్‌ స్కిట్‌, అనంతరం 10:30 గంటలకు ట్రాఫిక్‌ ప్లెడ్జ్‌, అలాగే విద్యార్థులకు పోలీస్‌ స్టేషన్లలో జరిగే విధి విధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు.

News November 14, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 14, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.05 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.55 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 14, 2025

వరంగల్: 24 అంతస్తుల్లో హాస్పిటలే ఉంటుంది: డీఎంఈ

image

వరంగల్‌లో నిర్మిస్తున్న 24 అంతస్తుల్లో త్వరలోనే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తామని డీఎంఈ డా.నరేంద్ర కుమార్ తెలిపారు. ఆసుపత్రికి బదులుగా ఐటీ హబ్ అంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, త్వరలోనే సనత్ నగర్ టిమ్స్, వరంగల్ 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రారంభించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.