News February 4, 2025
NLG: ఎమ్మెల్సీ స్థానానికి రెండవ రోజు నామినేషన్‌ల దాఖలు నిల్

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నుంచి నామినేషన్‌ల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు ప్రజా వాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు ఒకసెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం ఏలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో నామినేషన్‌ల పర్వం మొదలైన రెండవ రోజుకు ఒకే నామినేషన్ దాఖలైంది.
Similar News
News February 18, 2025
నర్సరీల పెంపకం వేగవంతం చేయాలి: కలెక్టర్ త్రిపాఠి

రానున్న వర్షాకాలంలో మొక్కలు నాటేందుకు గాను నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు ,ఎంపీడీవోలు, ఏపీవోలు, ఎంసిఓలతో వివిధ అంశాలపై సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నర్సరీల పెంపకాన్ని వేగవంతం చేయడంలో భాగంగా ముందుగా బ్యాగులలో మట్టి నింపడాన్ని పూర్తిచేయాలని, షెడ్ నెట్లు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News February 17, 2025
ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలతో కలెక్టర్ సమీక్ష

NLG: ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు గ్రామాల సందర్శన సందర్భంగా పాఠశాలలు, హాస్టళ్లలో అత్యవసరంగా పనులు చేపట్టాల్సి వస్తే ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఎంఎస్ఓ లు,ఎంఈఓలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు,ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు. ఆదర్శ పాఠశాలలో అత్యవసర పనులు అయితే వెంటనే ప్రతిపాదనలు పంపించాలన్నారు.
News February 17, 2025
NLG: ఫైనాన్స్, భార్యాభర్తల సమస్యలపై వినతులు

NLG: ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డేలో ఇవాళ జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన దాదాపు 35 మంది అర్జీదారులతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ రోజు భూ సమస్యలు, ఫైనాన్స్ సమస్యలు, భార్యాభర్తల సమస్యలపై వినతులు సమర్పించారు.