News December 25, 2024

NLG: ఎవరు ‘నామినేట్’ అవుతారు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం నాయకులు తహతహలాడుతున్నారు. పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌ల పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసింది. కాగా జిల్లాస్థాయి హోదాలైన గ్రంథాలయ సంస్థ, వైడీటీఏ, పలు కార్పొరేషన్ల పదవులు ఆశిస్తున్నారు. దీనికోసం అగ్ర నేతలను తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. పార్టీ కోసం పనిచేశామని, తమకే పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు.

Similar News

News December 9, 2025

నల్గొండ జిల్లాలో సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

image

నల్గొండ జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ పోలింగ్‌కు సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎన్నికల అధికారి కొర్రా లక్ష్మీ, కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షణలో మంగళవారం 7,892 మంది అధికారులకు ర్యాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. నల్గొండ, చండూరు డివిజన్లలోని 14 మండలాల్లోని 2,870 కేంద్రాల్లో వీరు విధులు నిర్వహించనున్నారని కలెక్టర్ తెలిపారు.

News December 8, 2025

కేతేపల్లి: మూడుసార్లు సస్పెండ్.. సతీమణికి సర్పంచ్ టికెట్

image

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన చిన్నబొస్క ప్రసాద్ గతంలో పలు కారణాలపై మూడుసార్లు (మొత్తం 18 నెలలు) సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ అయ్యారు. గ్రామ సభలు పెట్టలేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఉప సర్పంచ్‌ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో, ప్రసాద్ సతీమణి చిన్నబొస్క శైలజ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.

News December 8, 2025

NLG: మాటల తూటాలు.. స్నేహ బంధాలు!

image

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ఆయా పార్టీలు వైరం మరిచి ఒకరికొకరు సహకరించుకుంటున్నాయి. చాలా చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తుండగా.. మరికొన్ని చోట్ల సీపీఎం, బీజేపీ, ఇంకొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. నిన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చిన నేతలు ఇప్పుడు స్నేహబంధం చాటుతూ.. కలిసి ఓట్లు అడుగుతుండటంతో ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.