News April 8, 2025

NLG: ఏసీబీ అయితేనేం.. డోంట్ కేర్!

image

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులకు <<16034547>>ACB <<>>శాఖ ఒకటి ఉంటుందన్న భయం లేకుండా పోతుంది. పట్టుబడితే శాశ్వతంగా ఉద్యోగం పోదని 4 రోజులు ఆగితే మళ్లీ ఉద్యోగంలోకి రావచ్చనే ధీమా అవినీతి అధికారులు, ఉద్యోగుల్లో పెరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా లంచాలకు మరిగిన అధికారులు, ఉద్యోగులు ACBని అసలు పట్టించుకోవడం లేదనడానికి ఇటీవల పట్టుబడిన ఘటనలే నిదర్శనంగా చెప్పవచ్చు.

Similar News

News November 27, 2025

రుద్రవరంలో యాక్సిడెంట్.. 150 బస్తాల ధాన్యం నేలపాలు

image

రుద్రవరం మండల పరిధిలోని గుట్టకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో వరి ధాన్యం లోడుతో వెళుతున్న డీసీఎం లారీ అదుపుతప్పి బోల్తా పడింది. గుట్టకొండ ప్రాంతం నుంచి సుమారు 150 బస్తాలు వరి ధాన్యం లోడుతో లారీ నంద్యాలకు బయలుదేరింది. మార్గమధ్యంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం దాటిన తర్వాత వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్‌కు గాయాలయ్యాయి.

News November 27, 2025

గన్నవరం పోతే ఎలా..? భిన్నవాదనలు..!

image

కృష్ణా జిల్లాలోని గన్నవరాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలన్న డిమాండ్‌పై ఎమ్మెల్యేలలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా నుంచి గన్నవరం విడిపోతే జిల్లా ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే గన్నవరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇప్పటి వరకు ఈ ఎయిర్ పోర్ట్ జిల్లాకు పెద్ద ఆస్తిగా ఉంది. ఈ క్రమంలో గన్నవరంను చేజార్చుకోకూడదన్నది కొంతమంది ఎమ్మెల్యేల మనోగతంగా తెలుస్తోంది.

News November 27, 2025

రాయచోటిలో బస్సులు ఆపి వీరంగం..6 రోజుల జైలు

image

రాయచోటి టౌన్ బంగ్లా సర్కిల్‌లో శనివారం యువకుడు కళ్యాణ్ ఆర్టీసీ బస్సులను అడ్డగించి డ్రైవర్లతో దురుసుగా ప్రవర్తించాడు. ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. AJFCM కోర్టు రాయచోటిలో ఇన్‌ఛార్జ్ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ తేజస్విని ఎదుట హాజరుపరచగా ఆరు రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.