News May 18, 2024
NLG: ఐటిఐలలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ
నల్గొండ జిల్లాలోని 4 ప్రభుత్వ, 10 ప్రైవేట్ ఐటిఐలలో 2024-25/26 సంవత్సరం (ఒకటి, రెండు సంవత్సరాల కోర్సులకు) అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు నల్గొండ జిల్లా ఐటిఐల కన్వీనర్/ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.
Similar News
News December 11, 2024
ఎంజి యూనివర్సిటీ బిఈడి రిజల్ట్స్
MG విశ్వవిద్యాలయం బీఈడీ 2వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్లాగ్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్ ఫలితాలను మంగళవారం యూనివర్శిటీ అధికారులు విడుదల చేశారు. ఫలితాల వివరాలు ఎంజీయూ వెబ్సైట్లో పొందుపరిచినట్లు సిఓఈ డా. ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2వ సెమిస్టర్‌లో 1813 మంది పాస్ కాగా, 692 మంది ప్రమోట్ అయ్యారు. 85 మంది డిటైన్డ్ అయినట్లు తెలిపారు. మొదటి సెమిస్టర్‌లో 299 మంది పాస్ కాగా 237 మంది ఫెయిల్ అయ్యారు.
News December 10, 2024
పుష్ప-2లో అల్లు అర్జున్ షర్ట్ మన పోచంపల్లిదే..
ఇటీవల విడుదలైన పుష్ప-2 సినిమా రికార్డులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కొన్నిచోట్ల క్యాస్టూమ్స్‌గా పోచంపల్లి వస్త్రాలు మెరిశాయి. పోలీస్ ఆఫీసర్ బన్వర్‌సింగ్ షెకావత్‌తో.. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివ..’ అని చెప్పే డైలాగ్‌లో హీరో అల్లు అర్జున్ ధరించినది పోచంపల్లి ఇక్కత్ చొక్కానే. పోచంపల్లిలో షూటింగ్ సమయంలో ఈ షర్ట్ కొన్నట్లు స్థానికులు తెలిపారు.
News December 10, 2024
NLG: నేటి నుంచి దరఖాస్తుల పరిశీలన షురూ
ఇందిరమ్మ ఇళ్ల కోసం నల్గొండ జిల్లాలో 4.36, సూర్యాపేట జిల్లాలో 3.62 లక్షల దరఖాస్తులు రాగా వాటిని అధికారులు నేటి నుంచి పరిశీలించనున్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. గ్రామాల్లో పంచాయతీల్లో కార్యదర్శులు, మున్సిపల్ వార్డుల్లో వార్డు ఇన్‌ఛార్జిలు సర్వే చేపట్టనున్నారు. సర్వే ఏ విధంగా చేయాలనే విషయంపై వారికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు.