News January 20, 2025
NLG: ఒక్క యాప్తో వివరాలు మీ చేతిలో..

విహారయాత్రలు, దైవదర్శనాల సమాచారం కోసం ప్రభుత్వం మీ టికెట్ యాప్ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి సాగర్ బోటు ప్రయాణానికి సంబంధించిన వివరాలు, బుద్ధవనం, యాదగిరిగుట్ట ఆలయం, మిర్యాలగూడ చెరువులోని బోటింగ్ వివరాలను ఉంచారు. ఇంకా ఉమ్మడి నల్గొండలో ఛాయా సోమేశ్వర ఆలయం, పచ్చలసోమేశ్వరాలయం, వాడపల్లి, మట్టపల్లి, ఉండ్రుగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు, పిల్లలమర్రి శివాలయం వివరాలను పొందుపరచాల్సి ఉంది.
Similar News
News December 7, 2025
మిర్యాలగూడ డివిజన్ పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి

నల్గొండ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. మిర్యాలగూడ డివిజన్లో విధులు నిర్వహించే సిబ్బంది ర్యాండమైజేషన్ను ఆదివారం జిల్లా పరిశీలకురాలు కొర్ర లక్ష్మి పర్యవేక్షణలో కలెక్టర్ ఇలా త్రిపాఠి ఛాంబర్లో నిర్వహించారు. డివిజన్లోని పది మండలాల్లో 2,418 పోలింగ్ కేంద్రాలకు సరిగ్గా 2,418 బృందాలను కేటాయించారు.
News December 7, 2025
NLG: స్థానిక పోరు.. కూలీలు లేరు..!

స్థానిక పంచాయతీ ఎన్నికల ప్రచారం నల్గొండ జిల్లాలో జోరందుకుంది. అభ్యర్థులు, వారి బంధువులు, సమర్థకులు ప్రచారంలో నిమగ్నం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లో కూలీల కొరత తీవ్రమైంది. ఫలితంగా, ప్రస్తుతం యాసంగి సాగు పనులు చేపడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు దొరకక పోవడంతో పొలాల్లో పనులు ఆలస్యం అవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
నల్గొండ: మహిళలకు ఫ్రీ ట్రైనింగ్

నల్గొండలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కంప్యూటర్ కోర్సులో ఉచిత శిక్షణకు ఆసక్తి గల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మహిళా శిశు వికాస కేంద్రం మేనేజర్ ఎ.అనిత తెలిపారు. అర్హత, పూర్తి వివరాల కోసం కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


