News May 12, 2024

NLG: ఓటేయ్యనివ్వట్లేదా.. ఇలా చేయండి

image

ఓటేసే సమయంలో కొన్నిసార్లు అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా ఓటర్లపై ఏజెంట్లు సందేహం వ్యక్తం చేసి నకిలీ వ్యక్తని ఓటేయనివ్వరు. అప్పుడు పోలింగ్ అధికారికి రూ.2 చెల్లించి FORM-14లో పేరు, అడ్రెస్ రాసిచ్చి వారి ఐడెంటిటీని నిరూపించుకుని ఓటేయొచ్చు. దీంతోపాటు మీ ఓటు ఆల్రెడీ ఇంకెవరో వేశారంటే వెంటనే పోలింగ్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయాలి. టెండర్ ఓటును డిమాండ్ చేయొచ్చు. టెండర్ ఓటు పడితే రీపోలింగ్ కు అవకాశం ఉంది.

Similar News

News February 18, 2025

KCR త్యాగాలు చేసింది నిజమే.. కానీ: గుత్తా

image

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘కేసీఆర్ త్యాగాలు చేసింది నిజమే.. తెలంగాణ ఉద్యమం నడిపింది వాస్తవమే.. కానీ కేసీఆర్ నాలుగు కోట్ల ప్రజల హీరో అయితే.. ఆ ప్రజలే ఎందుకు ఓడించారు. పదేపదే ప్రభుత్వం పడిపోతుంది అంటే అది అధికారం కోల్పోయిన బాధతో బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రజలు అంటున్నారు’ అని గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

News February 18, 2025

NLG: హత్య కేసులో 17మందికి జీవిత ఖైదు

image

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్యకేసు విషయంలో 17 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. నల్లగొండ జిల్లా ఎస్సీ ఎస్టీ, జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి రోజా రమణి శిక్షను ఖరారు చేస్తూ మంగళవారం తీర్పునిచ్చారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులు ఉండగా అందులో ఒకరు ఇప్పటికే మరణించారు. అడ్డగూడూరుకు చెందిన ఓ వ్యక్తిని హత్య చేసిన విషయంలో వీరికి జీవిత ఖైదు శిక్ష పడింది.

News February 18, 2025

నల్గొండ: వేసవికి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

image

రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నీటి సరఫరా విభాగంపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. మంచి నీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

error: Content is protected !!