News August 26, 2024
NLG: కలవరపెడుతున్న సాగర్ డ్యాం లీకేజీలు

సాగర్ డ్యాం లీకేజీలు కలవరపెడుతున్నాయి. డ్యాం నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్లో కొన్ని బ్లాకుల నుంచి నీటి ఊట వస్తోంది. ప్రధాన డ్యాంలో 1 నుంచి 23వ బ్లాకు వరకు ఎడమ వైపు నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్ ఉండగా 24 నుంచి 50వ బ్లాకు వరకు 26 రేడియల్ క్రస్ట్ గేట్లు అమరి ఉన్న ఓవర్ ఫ్లో సెక్షన్ ఉంది. స్పిల్ వేకు కుడివైపు 51 నుంచి 76 వరకు బ్లాకులు ఉన్నాయి. జలాశయంలో గరిష్ట నీటిమట్టం వచ్చినప్పుడల్లా డ్యాం నుంచి నీరు తీకవుతోంది.
Similar News
News November 12, 2025
NLG: ఆ సంచి ప్రచారానికేనా..!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు ప్రచారానికే తప్ప బియ్యం తీసుకెళ్లేందుకు పనికిరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంచుల కొలతలు, పోర్టబిలిటీ, బయోమెట్రిక్ నిబంధనలపై రేషన్ డీలర్లు, కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,66,100 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంచులు కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే తీసుకెళ్లేలా రూపొందించారు.
News November 12, 2025
NLG: ఆశల సాగులో రైతన్న.. యాసంగికి సిద్ధం

ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో నల్గొండ జిల్లాలో రైతన్న యాసంగి సాగుకు సిద్ధమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూశారు. వానకాలం నష్టాలు మిగిల్చినా యాసంగికైనా కలిసొస్తుందేమో అనే ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నాడు.
News November 12, 2025
నల్గొండకు నేషనల్ అవార్డు

జల్ సంజయ్ జన్ భాగిదారీలో రాష్ట్రానికి తొలి ర్యాంకు వచ్చింది. రాష్ట్రంలో నల్గొండతో పాటు ఆదిలాబాద్ మంచిర్యాల జల సంరక్షణలో టాప్లో నిలిచిన విషయం విదితమే. ఈ పథకాన్ని పక్కాగా అమలు పరిచినందుకు జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు జిల్లాకు రావడం తొలిసారి. కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవ వల్లే ఇది సాధ్యమైంది. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది.


