News March 18, 2025
NLG: కారు టైర్ పగిలి రోడ్డు ప్రమాదం.. తాత, మనవడు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరగ్గా ఇద్దరు మృతి చెందారు. చండూరుకు చెందిన శేఖర్ రెడ్డి, శ్వేత దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు HYDలో ఉంటున్నారు. చిన్న కుమారుడు నిదయ్ రెడ్డి, తండ్రి వెంకట్ రెడ్డిలతో కలిసి శ్వేత HYD నుంచి జడ్చర్లకు వెళ్తున్నారు. మాచారం సమీపంలో టైరుపగిలి అవతలివైపు వస్తున్న బస్సును ఢీకొట్టగా తాత, మనవడు మృతిచెందారు. శ్వేత పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News November 1, 2025
చిన్నసూరారం ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తూకాలు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, బస్తాలు, పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.
News November 1, 2025
NLG: ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశాం: కలెక్టర్

మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లాలోని 10 మండలాల పరిధిలో కొంతమేరకు తడిసిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.
News November 1, 2025
మూగజీవాలకు కష్టాలు.. నట్టల మందుల సరఫరా నిలిపివేత

నల్గొండ జిల్లాలో గత రెండేళ్లుగా పశుసంవర్ధక శాఖ మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సరఫరా చేయకపోవడంతో కాపరులు ప్రైవేటుపై ఆధారపడుతున్నారు. జిల్లాలో సుమారు 12 లక్షల గొర్రెలు, 2 లక్షల మేకలు ఉన్నట్లు అంచనా. స్టాక్ త్వరలో వస్తుందని, అందిన వెంటనే పంపిణీ చేస్తామని ఏడీ రమేష్ బాబు తెలిపారు.


