News February 4, 2025

NLG: కాషాయదళంలో ‘అధ్యక్ష’ దుమారం

image

BJP జిల్లా అధ్యక్షుల ఎన్నికపై దుమారం చెలరేగుతోంది. 3జిల్లాల అధ్యక్ష పదవులకు కీలక నేతలు బరిలో ఉండటంతో బాధ్యతలు ఎవరికివ్వాలనే విషయంలో అధిష్ఠానం డైలమాలో పడింది. యాదాద్రి, SRPT జిల్లాలకు సంబంధించి నాయకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ముఖ్యనేతలు సైతం ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో ఎవరికివ్వాలనే విషయంలో సందిగ్ధం కొనసాగుతోంది. నల్గొండ జిల్లాకు వర్షిత్‌రెడ్డి నియామకంపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Similar News

News February 4, 2025

NLG: ఎమ్మెల్సీ స్థానానికి రెండవ రోజు నామినేషన్‌ల దాఖలు నిల్ 

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం నుంచి నామినేషన్‌ల పర్వం మొదలైన విషయం తెలిసిందే. మొదటి రోజు ప్రజా వాణి పార్టీ నుంచి లింగిడి వెంకటేశ్వర్లు ఒకసెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మంగళవారం ఏలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో నామినేషన్‌ల పర్వం మొదలైన రెండవ రోజుకు ఒకే నామినేషన్ దాఖలైంది. 

News February 4, 2025

UPDATE: దేవరకొండ మృతదేహం వెంకటేష్‌గా గుర్తింపు.!

image

దేవరకొండ పట్టణ శివారులోని తాటికోల్ రోడ్డు భాగ్యనగర్ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతుడు ఉప్పునూతల వెంకటేష్ యాదవ్‌గా కుటుంబీకులు గుర్తించారు. మృతుడు వెంకటేష్ చనిపోయే మనస్తత్వం కాదని, చాలా ధైర్యం కలవాడని కుటుంబీకులు తెలిపారు. వెంకటేష్ మృతిపైన పలు అనుమానాలు ఉన్నాయని, హత్య చేసి, ఉరి వేసుకున్నట్టు చిత్రీకరించారని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేశారు.

News February 4, 2025

NLG: తొలిరోజు ఒక్క నామినేషన్ దాఖలు

image

వరంగల్ – ఖమ్మం- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజు ప్రజావాణి పార్టీ అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10 వరకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని, ఈనెల 8, 9 తేదీలలో ప్రభుత్వ సెలవు దినాలలో ఎలాంటి నామినేషన్లు స్వీకరించడం జరగదని తెలిపారు.

error: Content is protected !!