News October 7, 2024

NLG: కూతురుతో కలిసి తల్లి మిస్సింగ్

image

కుటుంబ తగాదాలతో భర్తతో గొడవపడి కుమార్తెను తీసుకుని మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయింది. నల్గొండ వన్ టౌన్ సీఐ రాజశేఖర్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన కత్తుల సుధ తన భర్త ప్రసాద్‌తో గొడవపడి కుమార్తె కావ్యను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సుధ మానసికవ్యాధితో బాధపడుతుందని ఆమె అత్త కత్తుల ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 3, 2024

వచ్చే ఏడాది మే నాటికి 4,000 మెగావాట్లు గ్రిడ్‌కు అనుసంధానం: Dy.CM

image

యాదాద్రి పవర్ స్టేషన్‌ను వచ్చే ఏడాది మే నాటికి పూర్తిచేసి 4000 మెగావాట్ల విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో మంత్రుల బృందం ఆదివారం పర్యటించింది. యాదాద్రి పవర్ ప్లాంట్ స్టేషన్లో విద్యుత్తు ఉత్పత్తి గ్రిడ్‌కు అనుసంధానం చేసే కార్యక్రమం విజయవంతమైందని డిప్యూటీ CM భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

News November 3, 2024

NLG: కానిస్టేబుల్‌ను బలి తీసుకున్న ఆర్థిక సమస్యలు

image

ఆర్థిక సమస్యలే కానిస్టేబుల్‌ను బలి తీసుకున్నాయి. నార్కెట్‌పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన కటుకూరి రవిశంకర్ (42) నల్గొండ పట్టణంలోని పూజిత అపార్ట్‌మెంట్‌లో నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రవిశంకర్ ఆర్థిక సమస్యల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లి వెంకటమ్మ నల్గొండ టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

News November 3, 2024

NLG: గుండ్లపల్లి కాలువ వద్ద దామోదర్ మృతదేహం లభ్యం

image

కనగల్ మండలం షాబ్దుల్లాపురం కాలువలో <<14512610>>తండ్రి, కొడుకులు గల్లంతు<<>> కాగా నేడు ఉదయం సురవరం దామోదర్ మృతదేహం లభ్యమైంది. నల్లగొండ పరిధిలోని గుండ్లపల్లి వద్ద కాలువలో నేడు ఉదయం తండ్రి అయిన దామోదర్ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా కుమారుడు ఫణింద్ర వర్మ ఆచూకీ ఇంకా లభించ లేదు.