News April 2, 2025

NLG: కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

image

నల్గొండలోని కేంద్రియ విద్యాలయంలో 2 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తులను కేంద్రియ విద్యాలయ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 నుంచి 12 వదకు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 11లోగా విద్యాలయంలో అందజేయాలన్నారు. టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేంద్రియ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుందని తెలిపారు.

Similar News

News November 5, 2025

కొలనుపాక సోమేశ్వరాలయాన్ని దర్శించుకున్న కలెక్టర్

image

ఆలేరు మండలంలోని కొలనుపాక ప్రాచీన దేవాలయమైన శ్రీ చండికాంబ సమేత సోమేశ్వర స్వామి ఆలయాన్ని మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ హనుమంతరావు దర్శించుకున్నారు. కార్తీకమాసం సందర్భంగా దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం తెలుపి, దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News November 5, 2025

బాపట్లలో ప్రైవేట్ బస్సుల్లో తనిఖీలు

image

ప్రైవేటు బస్సులు నడిపేవారు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని బాపట్ల వాహన తనిఖీ అధికారి ప్రసన్నకుమారి చెప్పారు. బాపట్ల పట్టణంలో పట్టణ పోలీసులతో కలిసి ప్రైవేటు బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేసి ఎమర్జెన్సీ డోర్లను పరిశీలించారు. బస్సుల పత్రాలను పరిశీలించి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. బస్సులలో ఫైర్ సేఫ్టీ సిలిండర్ అందుబాటులో ఉంచుకోవాలని పరిమితికి మించి వేగంగా ప్రయాణించవద్దని సూచించారు.

News November 5, 2025

అయిజ: ఇంటర్నేషనల్ రన్నింగ్‌లో నడిగడ్డ వాసి ఫస్ట్

image

ఇంటర్నేషనల్ రన్నింగ్‌లో గద్వాల జిల్లా అయిజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ మొదటి స్థానంలో నిలిచాడు. 42 కిలోమీటర్ల ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలు నేపాల్ రాష్ట్రంలో జరిగాయి. ఆ పోటీల్లో పాల్గొన్న హరికృష్ణ సునాయాసంగా 42 కిలోమీటర్లు రన్నింగ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచాడు. నడిగడ్డ వాసికి మొదటి స్థానం దక్కడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.