News April 2, 2025
NLG: కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

నల్గొండలోని కేంద్రియ విద్యాలయంలో 2 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తులను కేంద్రియ విద్యాలయ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 నుంచి 12 వదకు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 11లోగా విద్యాలయంలో అందజేయాలన్నారు. టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేంద్రియ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుందని తెలిపారు.
Similar News
News April 17, 2025
వనపర్తి: హక్కులను కాపాడుకోవాలి: పి.జయలక్ష్మి

మే 20న దేశవ్యాప్తంగా జరగనున్న సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.జయలక్ష్మి కోరారు. సీఐటీయూ వనపర్తి జిల్లా అధ్యక్షుడు ఎం.రాజు అధ్యక్షతన గురువారం వనపర్తిలో నిర్వహించిన ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడాలని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
News April 17, 2025
వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.
News April 17, 2025
వనపర్తి: ‘ఉపాధ్యాయుల సంక్షేమం PRTU TSతోనే సాధ్యం’

ఉపాధ్యాయుల హక్కుల సాధన, సంక్షేమం PRTU TSతోనే సాధ్యమని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో PRTU TS గౌరవ అధ్యక్షుడు శివకుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే PRC ఇప్పించే ఏర్పాటు, 2003 DSC వారికి పాత పెన్షన్‌ను ఇప్పించడం, పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లుల క్లియరెన్స్ చేస్తామన్నారు.