News April 7, 2025
NLG: కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు

రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదారులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
Similar News
News April 15, 2025
నల్గొండ: టుడే టాప్ న్యూస్

* నకిరేకల్ వీటీ కాలనీలో అగ్నిప్రమాదం * దళిత యువతి చావుకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేయాలని బొక్కముంతల పహాడ్‌లో బంధువుల ఆందోళన * యాసంగి పంటలపై ప్రకృతి పంజా * చందంపేటలో కుక్కల దాడిలో 12 గొర్రెలు మృతి * రిటైర్డ్ హోంగార్డుకు ఎస్పీ శరత్ చంద్ర పవార్ సన్మానం * పైన టూల్ బార్‌లో లోకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్ క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా వార్తలను 5 నిమిషాల్లో తెలుసుకోండి.
News April 15, 2025
SRPT: కొడుకుతో బావిలో దూకి తల్లి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. చిలుకూరు మండలం కొత్తకొండాపురంలో బావిలో దూకి తల్లి వీరమ్మ, కుమారుడు నాగేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. రెండు రోజుల క్రితమే వీరమ్మ అన్న నాగేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందగా.. తమ బాగోగులు చూసేవారు లేరని మనస్తాపం చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
News April 15, 2025
పొలంలో బయటపడ్డ పురాతన శివలింగం

సూర్యాపేట జిల్లాలో పొలం చదును చేస్తుండగా పురాతన శివలింగం బయటపడింది. చివ్వెంల మండలం తిమ్మాపురంలో రణబోతు బాధిరెడ్డి తన వ్యవసాయ భూమిలో జేసీబీతో చదును చేయిస్తుండగా పురాతన శివలింగంతో పాటు నాగపడిగ విగ్రహాలు జేసీబీకి తగలడంతో వాటిని జాగ్రత్తగా తీసి పక్కకు పెట్టి శుభ్రం చేశారు. తిమ్మాపురంతో పాటు, మోదీన్‌పురం పరిసర గ్రామాల నుంచి శివభక్తులు అక్కడకు చేరుకుని క్షీరాభిషేకం చేసి పూజలు నిర్వహించారు.