News July 2, 2024
NLG: కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ

భారత ప్రభుత్వం నూతన న్యాయ చట్టాలు 2023 సోమవారం నుంచి అమలులోకి వచ్చాయని ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందని ప్రజలకు మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. కొత్త చట్టాల ద్వారా మహిళలకు పూర్తి రక్షణ ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News January 10, 2026
నల్గొండ: వేరే రాష్ట్రంలో దాక్కున్నా.. పోలీసులు వదల్లేదు

రెప్పపాటులో ప్రయాణికుల ఆభరణాలను మాయం చేసే అంతరాష్ట్ర ‘థార్’ ముఠా దొంగతనం ఉదంతాన్ని జిల్లా పోలీసులు ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానంతో 15రోజుల పాటు మధ్యప్రదేశ్లోని థార్ జిల్లాను జల్లెడ పట్టినCCS బృందం, ముఠా సభ్యుడైన షా అల్లా రఖాను అరెస్టు చేసింది. నిందితుడి వద్ద నుంచి రూ.85 లక్షల విలువైన 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్ చంద్ర పవర్ తెలిపారు.
News January 10, 2026
నల్గొండ: నేటి నుంచి టీసీసీ పరీక్షలు

నల్గొండ జిల్లాలో టెక్నికల్ టీచర్ సర్టిఫికెట్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. డ్రాయింగ్, టైలరింగ్ కోర్సుల కోసం జిల్లా కేంద్రంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1550 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈనెల 13 వరకు ప్రతిరోజూ రెండు సెషన్లలో (ఉదయం 10-1, మధ్యాహ్నం 2-5) పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
News January 10, 2026
NLG: రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి వరకు ఛాన్స్

సబ్సిడీపై అందించే వ్యవసాయ యంత్ర పరికరాల కోసం రైతులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్ కుమార్ తెలిపారు. సంక్రాంతి పండుగ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు తమ పరిధిలోని వ్యవసాయ అధికారులను సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 2025 సంవత్సరానికి గాని పథకం అమలు కోసం ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసింది.


