News April 10, 2025
NLG: కొనుగోళ్లకు కసరత్తు.. జిల్లాలో 384 కేంద్రాలు

యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆరంభానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐకేపీ, సొసైటీలు, ఏఎంసీలు, ఎఫ్సీఐల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 384 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వడ్ల సేకరణకు అవసరమయ్యే గన్నీ బ్యాగులు, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు తదితర పరికరాలు, వస్తువులను సిద్ధం చేస్తున్నారు. ధాన్యం నిల్వకు గోదాములను రెడీ చేశారు.
Similar News
News October 29, 2025
విషాదం: 10 రోజులకే వీడిన బంధం.. నవవధువు మృతి

NLG: గుర్రంపోడు(M)లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవవధువు మృతి చెందగా, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. చామలేడుకు చెందిన సిలువేరు నవీన్, 10 రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న తన భార్యతో కలిసి బైక్పై గుర్రంపోడుకు వెళుతున్నారు. వారు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా, ఎదురుగా మలుపు తిప్పుతున్న మరో బైక్ను చూసి నవీన్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో దంపతులిద్దరూ బైక్పై నుంచి ఎగిరి పడగా ఈ దుర్ఘటన జరిగింది.
News October 29, 2025
అక్రమ దత్తత.. ఏడుగురు అరెస్ట్: నల్గొండ ఎస్పీ

2 వేర్వేరు కేసులలో 10 రోజుల ఆడ శిశువును, 21 రోజుల మగ శిశువును అక్రమ దత్తత చేసిన ఏడుగురు వ్యక్తులను జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ బుధవారం వెల్లడించారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించి ఒకరు, డబ్బుల కోసం మరొకరు కన్నపేగు బంధం మరిచి పిల్లలను అమ్ముకోగా.. జిల్లా పోలీసులు ఇద్దరు చిన్నారులను రక్షించి శిశు గృహకు తరలించారు.
News October 29, 2025
నల్గొండ: మొంథా తుఫాన్.. జిల్లా యంత్రాంగం అప్రమత్తం

భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి అత్యవసరంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పలు కీలక ఆదేశాలిచ్చారు. అధికారులు విధి నిర్వహణలో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. అంగన్వాడీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు. రహదారులు, విద్యుత్ సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని, కంట్రోల్ రూమ్కు 18004251442 సమాచారం అందించాలని తెలిపారు.


