News March 7, 2025
NLG: కోర్టులో ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల

నల్గొండ న్యాయ సేవాధికార సంస్థలో టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, జిల్లా జడ్జి యం.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీతో పాటు టైపింగ్ హయర్‌లో పాసై, నిమిషానికి 45 పదాలు టైపు వచ్చి ఉండాలన్నారు. అర్హులైన అభ్యర్డులు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం కోర్టు వెబ్ సైట్‌లో చూడాలని పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
రేపు వైసీపీ ఇఫ్తార్ విందు

AP: రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు రేపు సాయంత్రం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు వైసీపీ వెల్లడించింది. విజయవాడ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో కార్యక్రమం జరుగుతుందని తెలిపింది. మాజీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు ముస్లిం మత పెద్దలు, పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరవుతారని పేర్కొంది.
News March 25, 2025
BREAKING: అకౌంట్లలో డబ్బులు జమ

TG: రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ 3 నుంచి 4 ఎకరాల్లోపు అన్నదాతల ఖాతాల్లో రూ.200 కోట్ల డబ్బులను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఆ కేటగిరీలో ఇప్పటి వరకు దాదాపు రూ.500 కోట్లు రిలీజ్ చేసినట్లయ్యింది. మొత్తంగా 54.74 లక్షల రైతులకు రూ.4,666.57 కోట్లు అందించింది. ఈ నెలాఖరులోపు రైతులందరి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
News March 25, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి: జేసీ
☞ చంద్రబాబు ఎంతమందికి జరిమానాలు విధించాడు?: కాటసాని
☞ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల వాహనాలే
☞ కర్ర సాములో అదరగొడుతున్న ఉయ్యాలవాడ మోడల్ స్కూల్ విద్యార్థి
☞ రంగాపురానికి చెందిన IIT విద్యార్థి ఆత్మహత్య
☞ ఆళ్లగడ్డ MLA భర్త కిలో చికెన్ కు రూ.10 వసూలు: YCP
☞ బెట్టింగ్ లపై ఎస్పీ హెచ్చరిక