News March 2, 2025
NLG: కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ భద్రత

WGL- KMM- NLG శాసన మండలి ఉపాధ్యాయ MLC ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. అవసరమైన ముందస్తు ప్రణాళికతో పాటు ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరిధిలో ఏ చిన్న పాటి అవాంఛనీయ ఘటన జరగకుండా దాదాపు 530 మంది అధికారులు, సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Similar News
News July 6, 2025
NRPT: తొలి ఏకాదశికి ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశికి వైష్ణవ ఆలయాలను అందంగా తీర్చిదిద్దారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించి సిద్ధమయ్యాయి. ఆదివారం తొలి ఏకాదశి పురస్కరించుకొని నారాయణపేట పట్టణంలోని తిరుమల గుట్ట వెంకటేశ్వర స్వామి ఆలయం, పత్తి బజార్‌లోని బాలాజీ మందిర్, లోకాయపల్లి గోపాల స్వామి ఆలయం, పళ్ల వీధిలో వెలసిన షోడశబాహు లక్ష్మీనరసింహ స్వామి సహిత రాఘవేంద్ర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
News July 6, 2025
డ్రోన్ యంత్రాలతో ప్రత్యేక గస్తీ: ఎస్పీ

మహిళల భద్రతకు శక్తి దళం ప్రత్యేక గస్తీ నిర్వహిస్తుందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. డ్రోన్ యంత్రాల ద్వారా ఆకతాయిల కదలికలను పసిగడుతున్నామన్నారు. మహిళలకు అత్యవసర పరిస్థితుల్లో నంబర్ :112, 1930, 1098 అలాగే శక్తి టోల్ ఫ్రీ నెంబర్: 7993485111 ఫోన్ చేయాలని సూచించారు.
News July 6, 2025
ADB: రేపే లాస్ట్.. విద్యార్థులు APPLY చేసుకోండి

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలకు ప్రభుత్వం HYDలో అందించే 10 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఉమ్మడి ADBలోని SC, ST, BC, మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి భగత్ సునీత కుమారి తెలిపారు. డిగ్రీ పాసైన వారు ఈనెల 7 వరకు tsstudycircle.co.in వెబ్‌సైట్‌లో APPLY చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94941 49416 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.