News March 29, 2024

NLG: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

image

ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నడస్తున్నందుకు చాలా మంది యువత ఈజీగా డబ్బులు సంపాదించడం కోసం క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని జిల్లా ఎస్పీ చందనా దీప్తి అన్నారు. అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల ఆర్థికంగా దెబ్బతిని సూసైడ్ చేసుకొని ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. యువత క్రికెట్ బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఎస్పీ కోరారు.

Similar News

News February 23, 2026

నల్గొండ: మైనారిటీల ఆర్థికాభివృద్ధికి గోల్డెన్ ఛాన్స్

image

మైనారిటీల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి రెండు కీలక పథకాల కింద దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లాలో ఆసక్తి గలవారు మార్చి 1 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి.విజయేందర్ రెడ్డి తెలిపారు. వెబ్‌సైట్ :http://tsobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News February 23, 2026

సీఎం కప్ హాకీ రాష్ట్రస్థాయి విజేతగా నల్గొండ జట్టు

image

హైదరాబాద్‌ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన సీఎం కప్ రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో నల్గొండ బాలుర జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుపై 2-0 తేడాతో గెలుపొంది ఛాంపియన్‌గా నిలిచింది. ఈ చరిత్రాత్మక విజయం పట్ల జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, హాకీ అసోసియేషన్ కార్యదర్శి ఇమామ్ కరీం హర్షం వ్యక్తం చేస్తూ క్రీడాకారులను అభినందించారు.

News February 23, 2026

నల్గొండ: గణనీయంగా తగ్గిన మాతా శిశు మరణాలు

image

రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు మాతా శిశువుల ఆరోగ్యానికి రక్షణ కవచంలా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి మౌలిక సదుపాయాలు, మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో గత ఎనిమిదేళ్లుగా జిల్లాలో మరణాల రేటు గణనీయంగా తగ్గుతోంది. 2018-19లో 335 శిశువులు, 14 మంది తల్లులు మరణించగా, 2025 నాటికి ఆ సంఖ్య 72 శిశువులకు, 9 మంది తల్లులకు పడిపోయింది.