News February 25, 2025

NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞ఎవరికాలంలో నల్గొండ <<15559631>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..

Similar News

News December 21, 2025

జగిత్యాల: పదవి సరే… పైసలేవీ..!

image

ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికలు జరుగగా నూతన పాలకవర్గాలు సోమవారం కొలువుదీరనున్నాయి. ఈ మేరకు జిల్లాలో 385 గ్రామ పంచాయతీలు, 3536 వార్డు స్థానాల్లో సోమవారం పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల్లో లక్షలు ఖర్చు చేసి గెలుపొందిన నూతన సర్పంచులను పదవులు వరించిన సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పదవి ఉన్న పైసలు లేక తిప్పలు తప్పేలా లేవు. కేవలం కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆశలు ఉన్నాయి.

News December 21, 2025

ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

image

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

News December 21, 2025

ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ వల్లే ఎక్కువ అన్యాయం: రేవంత్

image

TG: కృష్ణా జలాల్లో ఏపీకి 64%, తెలంగాణకు 36% చాలని సంతకం పెట్టిన ద్రోహి KCR అని సీఎం రేవంత్ ఫైరయ్యారు. ఆ సంతకంతో 3 జిల్లాలకు మరణశాసనం రాశారని విమర్శించారు. ‘ఉమ్మడి ఏపీ కంటే కేసీఆర్ చేసిన అన్యాయమే ఎక్కువ. కాళేశ్వరం కూలినా వరి ఉత్పత్తిలో TGని అగ్రస్థానంలో నిలిపాం. కృష్ణా జలాల్లో 71% వాటా కావాలని పోరాడుతున్నాం. పదేళ్ల KCR పాలనలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు’ అని చిట్‌చాట్‌లో మండిపడ్డారు.