News February 25, 2025

NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

image

☞ఎవరికాలంలో నల్గొండ <<15559630>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..

Similar News

News September 18, 2025

‘OG’ టికెట్ ధరల పెంపు.. YCP శ్రేణుల ఫైర్

image

పవన్ కళ్యాణ్ OG సినిమా <<17742687>>టికెట్<<>> రేట్లను పెంచడంపై వైసీపీ శ్రేణులు ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. బెనెఫిట్ షోకు ఏకంగా రూ.1,000 (జీఎస్టీ కలుపుకుని) ఏంటని ప్రశ్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ తన సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే పుష్ప-2 సినిమా టికెట్ ధరలను సైతం (రూ.800+GST) పెంచిన విషయం గుర్తు లేదా అని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News September 18, 2025

అనకాపల్లి జిల్లాకు 18వేల టన్నుల యూరియా సరఫరా

image

అనకాపల్లి జిల్లాలో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక సహకార సంఘాలకు ఇంతవరకు 18వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్‌రావు బుధవారం తెలిపారు. మత్సవానిపాలెం రైతుసేవా కేంద్రంలో యూరియా పంపిణీని ఆయన సమీక్షించారు. జిల్లాలో ఆహార, వాణిజ్య, ఉద్యానవన పంటలు 1,41,000 హెక్టార్లలో సాగులో ఉన్నాయని చెప్పారు. వీటికి అక్టోబర్ నెల మొదటి వారం వరకు 20 వేల టన్నుల యూరియా అవసరమన్నారు.

News September 18, 2025

కరవాకలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

image

మామిడికుదురు మండలంలోని కరవాకలో వైనుతీయ నది తీరం వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్సై చైతన్య కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.