News June 3, 2024
NLG: గంటలోనే మొదటి రౌండ్ ఫలితం

ఎంపీ ఎన్నికల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుండగా, గంటలోనే మొదటి రౌండ్ ఫలితాన్ని వెల్లడించనున్నారు. ఒక్కో రౌండ్లో 14 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 24 రౌండ్లలో పూర్తి లెక్కింపు కానుంది. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో పూర్తి ఫలితం వెలువడనుంది. అయితే ప్రతి టేబుల్కు ఆయా పార్టీలకు సంబంధించిన ఒక ఏజెంట్ను నియమించుకునేందుకు అనుమతిస్తారు.
Similar News
News November 27, 2025
NLG: రెండు డివిజన్లు.. 117 క్లస్టర్లు!

నల్లగొండ, చండూరు డివిజన్లో పరిధిలో 14 మండలాల్లో నామినేషన్ల స్వీకరణకు 117 క్లస్టర్లను గుర్తించారు. ప్రతి మూడు నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేశారు. వారి గ్రామంలో సర్పంచ్, వార్డు సభ్యుడిగా పోటీ చేయాలనుకునే వారు ఆ క్లస్టర్లోనే నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది. క్లస్టర్లో రిటర్నింగ్ ఆఫీసర్ తోపాటు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు.
News November 26, 2025
NLG: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష

గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించాలని స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ ఎన్నికల నోడల్ అధికారులతో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు.
News November 26, 2025
నల్గొండ జిల్లాలో నేటి సమాచారం

మునుగోడు: పెట్రోల్ బంకుల్లో తనిఖీ
శాలిగౌరారం: వే2న్యూస్ కథనానికి స్పందన
పెద్దవూర: హైవేపై రాస్తారోకో.. స్తంభించిన ట్రాఫిక్
నల్గొండ: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.30 లక్షలు: మంత్రి కోమటిరెడ్డి
మిర్యాలగూడలో భారీ ర్యాలీ
నల్గొండ: సర్పంచ్ ఎన్నికల్లో వారిని దింపేందుకు ఫోకస్
నల్గొండ: పల్లెపోరుకు యంత్రాంగం రెడీ
మిర్యాలగూడ: వందే భారత్ రైలుకు అదనంగా 4 బోగీలు
కట్టంగూరు : భక్తులను ఆకట్టుకున్న మల్లన్నమర్రి


