News September 14, 2024

NLG: ‘గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి’

image

NLG జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, మూసి రివర్, 14వ మైలురాయి, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలండి అడవిదేవుల పల్లి, కొండ భీమనపల్లి, డిండి పోలీస్ పికెట్లు, హెడ్ లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

Similar News

News November 7, 2025

Way2News కథనానికి నల్గొండ కలెక్టర్ స్పందన

image

‘ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా?’అనే శీర్షికతో ఈ నెల 4న Way2Newsలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలోని ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.

News November 7, 2025

బాలల హక్కులు, విద్యపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

image

నల్గొండ జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ, విద్యపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.
గురువారం రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు హరిత, చందనలతో ఆమె సమావేశమయ్యారు. విద్యా సంస్థల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించడంతో విద్యా వ్యవస్థ బలోపేతమైందని కలెక్టర్ వెల్లడించారు. బాల్య వివాహాలు, శిశు విక్రయాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె వివరించారు.

News November 6, 2025

నల్గొండ: సోదరిని చూసేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడని చిట్యాల ఎస్ఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా.. SRPT జిల్లా కేసారానికి చెందిన సువర్ణ రాజు (19), గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన సోదరిని చూడడానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. చిట్యాల దాటాక అర్ధరాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొనగా బలమైన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై తండ్రి లింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.