News July 27, 2024

NLG: గుత్తేదారులు ముందుకు రావట్లే !

image

ఉమ్మడి జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం పుట్టిన విషయం తెలిసిందే. జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు మత్స్యశాఖ అధికారులు టెండర్లను ఆహ్వానించారు.. ఈ నెల 10 నుంచి 23 వరకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. కానీ ఉమ్మడి జిల్లాలో ఒక్కరు కూడా టెండర్లు వేసేందుకు ముందుకురాలేదు.

Similar News

News February 27, 2026

రేపటి నుంచి ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీ

image

గర్భాశయ క్యాన్సర్ నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెచ్‌పీవీ టీకా పంపిణీ శనివారం నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానుంది. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. 14 ఏళ్లు దాటిన ప్రతి బాలికకు ఈ టీకా వేయనున్నారు. వచ్చే 90రోజుల్లో 15 ఏళ్లు నిండే వారు కూడా ఉచితంగా టీకా పొందేందుకు అర్హులని అధికారులు పేర్కొన్నారు.

News February 27, 2026

సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్.. మిల్లర్లపై ఆర్ఆర్ యాక్ట్!

image

జిల్లాలో సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టిన వ్యవహారంలో యంత్రాంగం కొరడా ఝుళిపించింది. సుమారు 5,89,533 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేసిన నలుగురు మిల్లర్లపై కేసులు నమోదు చేశారు. బకాయిల రికవరీకి ‘ఆర్ఆర్ యాక్ట్’ అమలు చేయాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ తహశీల్దార్లను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత, నిత్యావసర వస్తువుల చట్టం కింద చర్యలు చేపట్టారు.

News February 27, 2026

మున్సిపాలిటీల్లో పన్ను వసూళ్ల ‘డెడ్ లైన్’.. 32 రోజులే గడువు

image

మున్సిపాలిటీల్లో పన్ను వసూలుకు గడువు ముంచుకొస్తోంది. ఫిబ్రవరి ముగుస్తుండగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 32 రోజుల గడువు మాత్రమే మిగిలిఉంది. అయినా జిల్లాలోని NLG, MLG, DVK, HLY, CTL CDR, NKL, నందికొండ మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. JAN, FEBలో మున్సిపల్ ఎన్నికల హడావిడితోతో అధికారులు, సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించలేకపోయారు. దీంతో బల్దియాల్లో బకాయిలు పేరుకుపోయాయి.