News February 27, 2026
NLG: గొర్రెల కాపరి నుంచి MGU రిజిస్ట్రార్ వరకు..!

MGU నూతన రిజిస్ట్రార్‌గా ఆచార్య కొప్పుల అంజిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. యాదాద్రి జిల్లా సింగారానికి చెందిన ఆయన ప్రస్థానం అసాధారణం. ఒకప్పుడు స్కూల్ డ్రాపౌట్‌గా మారి, గొర్రెల కాపరిగా పనిచేసిన అంజిరెడ్డి, పట్టుదలతో చదివి నేడు వర్సిటీలో అత్యున్నత స్థాయికి ఎదిగారు. 2007లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి, వర్సిటీకి ‘న్యాక్’ గుర్తింపు తేవడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఎదుగుదల యువతకు ఆదర్శంగా నిలిచింది.
Similar News
News April 15, 2026
WGL: ఆర్డీవోలకే పూర్తి అధికారం.. ఇక ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారం..!

ఉమ్మడి WGLలో ఐదున్నర ఏళ్లుగా 1,89,739 సాదాబైనామా దరఖాస్తులు మోక్షం కోసం ఆఫీసర్ల టేబుళ్లపై ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం ఆర్డీవోలకే పూర్తి అధికారం ఇవ్వడంతో ఫాస్ట్ ట్రాక్‌లో పరిష్కారమవుతాయని, అఫిడవిట్ నిబంధన తీసేయడంతో కొర్రీలన్నీ పోయినట్టేనని అంతా భావిస్తున్నారు. కాగా కోర్టుల్లో పిల్ వేసి 2016లో GO 153, 2020లో GO 112 అమలు కాకుండా చేశారు. ప్రస్తుతం భూ భారతిలో మార్పులతో ఈ సమస్య పరిష్కారం కానుంది.
News April 15, 2026
వనపర్తి జిల్లాలో భానుడి భగభగలు..!

వనపర్తి జిల్లాలో గడచిన 24 గంటలు నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు విడుదల చేశారు. అత్యధికంగా దగడ 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వెలుగొండ 41.9, శ్రీరంగాపూర్ 41.8, వనపర్తి, వీపనగండ్ల 41.7, పెద్దమందడి, అమరచింత 41.5, ఆత్మకూర్ 41.3, జానంపేట, పెబ్బేరు, రేమోద్దుల 40.8, ఘన్పూర్ 40.7, మదనపూర్, పానగల్, కానాయపల్లి 40.5, ఏదుల 40.3, కేతేపల్లి, విలియంకొండ 40.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News April 15, 2026
MBNR: పది పరీక్షలు రాశారా? నేడే లాస్ట్ డేట్..!

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం MPC, BiPC గ్రూపులలో చేరేందుకు.. ఉమ్మడి ప్రవేశపరీక్ష TGRJC CET-2026 దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ పరీక్షకు NGKL, GDL, వనపర్తి, NRPT, MBNR జిల్లాలకు చెందిన ప్రస్తుతం 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మే 3న పరీక్ష జరగనుంది. దరఖాస్తుకు నేడు చివరి రోజు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. share it.!


