News December 6, 2024

NLG: గ్రామపంచాయతీ ఎన్నికలకు కసరత్తు

image

నల్గొండ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా గ్రామాల్లో ఇప్పటికే ప్రచురించిన ఓటరు జాబితా ఆధారంగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు చేపట్టారు. రెండ్రోజులుగా సంబంధిత ఎంపీడీఓలు, ఎంపీఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 1, 2026

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన నల్గొండ కొత్త కలెక్టర్

image

రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని నూతన కలెక్టర్ బడుగు చంద్రశేఖర్ ఈ రోజు హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ నూతన కలెక్టర్‌కు మంత్రి శుభాకాంక్షలు తెలిపి, ఆల్ ది బెస్ట్ చెప్పారు.

News January 1, 2026

నల్గొండ: 25 జీపీల్లో నూతన అకౌంట్లు

image

నల్గొండ జిల్లాలో కొత్తగా ఏర్పడిన 25 గ్రామ పంచాయతీల్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్లు తెరవాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం మూడు అకౌంట్లు తెరవాల్సి ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం నిధులకు ఒక అకౌంట్, రాష్ట్ర ప్రణాళిక సంఘం నిధులకు మరో అకౌంట్‌తో పాటు గ్రామపంచాయతీ నిధులకు సంబంధించి మూడో అకౌంట్ తీయాలని ఉత్తర్వులు ఇవ్వడంతో కొత్త పంచాయతీల్లో కొత్త అకౌంట్లు తెరిచారు.

News January 1, 2026

నల్గొండ: మున్సిపల్ ఎన్నికలు.. మరో చర్చ..!

image

మున్సిపల్ ఎన్నికల వేళ రిజర్వేషన్లపై ఆశావహుల్లో సందిగ్ధత నెలకొంది. ఈసారి జరిగే ఎన్నికల్లో పాత రిజర్వేషన్లనే కొనసాగిస్తారా లేక రిజర్వేషన్లను కొత్తగా మారుస్తారా అన్నదానిపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. జిల్లాలో నకిరేకల్ మినహా 8మున్సిపాలిటీలు ఉన్నాయి.గతంలో నల్గొండ ఓసీ జనరల్, చిట్యాల, హాలియా, దేవరకొండ జనరల్, చండూరు బీసీ మహిళ, నందికొండ జనరల్ మహిళ, మిర్యాలగూడ జనరల్ స్థానాలకు కేటాయించారు. మరి ఈసారి చూడాలి.