News March 31, 2025
NLG: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

జిల్లావ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇండ్లకోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. ఉమ్మడి జిల్లాకు 4,27,542 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికారపార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తామని జోరుగా పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News October 25, 2025
బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా ఇంకా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించని రైస్ మిల్లర్లు తక్షణమే వాటిని అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె మిల్లర్లతో సమావేశమయ్యారు. ధాన్యం తడవకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే అన్లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
News October 25, 2025
అవంతిపురంలో రైస్ మిల్లు తనిఖీ చేసిన కలెక్టర్

మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని సూర్య తేజ రైస్ ఇండస్ట్రీస్ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో జరుగుతున్న ధాన్యం ప్రాసెసింగ్ విధానాన్ని, బాయిల్డ్ రైసు తయారీని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించాలని మిల్లు యజమానికి కలెక్టర్ సూచించారు.
News October 25, 2025
NLG: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..!

జిల్లాలో ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదు (4906)లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా 2 వేల దరఖాస్తులు తక్కువ రావడం అధికారులను నివ్వెరపోయేలా చేసింది. అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది.


