News July 15, 2024
NLG: గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తున్న ఆర్టీసీ

ఒకప్పుడు పల్లె వెలుగుల బస్సుల రాకపోకలతో గ్రామీణ ప్రాంతాలు కళకళలాడేవి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాలను విస్మరిస్తుండడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు పూర్తిగా బస్సులను కుదించడంతో అటు ప్రజలు, రైతులు ఇటు కళాశాల, స్కూల్ విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. బస్సులు రాకపోవడంతో శాలిగౌరారం మండలంలో అనేక మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పారు.
Similar News
News November 21, 2025
NLG: వడివడిగా అడుగులు… ఏర్పాట్లపై ఈసీ కసరత్తు

జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి అడుగులు చకచకా పడుతున్నాయి. తొలుత GP ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయానికి రాగా ఎన్నికల సంఘం ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఈనెల 23న జిల్లాలో ఓటర్ల తుది జాబితాతో పాటు పోలింగ్ స్టేషన్ల వివరాలను విడుదల చేయనున్నారు. ఇతర ఏర్పాట్లపైనా దృష్టి సారించగా.. ఈనెలాఖరుకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
News November 21, 2025
NLG: డబుల్ లబ్ధిదారుల్లో.. 46 మంది అనర్హులు..!

నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీలో 46 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. వారి స్థానంలో ‘ప్రజా పాలన’ దరఖాస్తుల ద్వారా అర్హులైన వారిని పారదర్శకంగా డ్రా ద్వారా ఎంపిక చేశారు. మొత్తం 552 మంది లబ్ధిదారులకు త్వరలో ఇళ్లను పంపిణీ చేయనున్నట్లు ఆర్డీవో అశోక్ రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ తెలిపారు.
News November 21, 2025
ఖనిజ రవాణా వాహనాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

నల్గొండ జిల్లాలో కంకర, ఇసుక, ఇటుక వంటి ఖనిజాలను రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని మైన్స్ ఏడీ సామ్యేల్ జాకాబ్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా ఖనిజాలను సరఫరా చేస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలోని డీఎల్ఎస్ కమిటీ నిర్ణయం మేరకు, వినియోగదారులకు ఇసుక సరసమైన ధరలకే అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


