News September 28, 2024
NLG: ‘చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి’
విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. నల్గొండ పట్టణంలోని చర్లపల్లి సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో చట్టాల అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన లేక ఎంతో మంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జ్ అపర్ణ, పారా లీగల్ వాలంటరీ భీమనపల్లి శ్రీకాంత్ తదితరులున్నారు.
Similar News
News October 9, 2024
మిర్యాలగూడ: టీచర్ అయిన రిక్షావాలా కొడుకు
మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్ డీఎస్సీ – 2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News October 9, 2024
చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద హైవే పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న తిప్పర్తి మండల పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ పుట్టా యాదగిరి గుండెపోటుతో మృతిచెందారు. పోలీస్ సిబ్బంది మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News October 9, 2024
నల్గొండ: యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి నర్సిరెడ్డి
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం టీఎస్‌యూటీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి అలుగుబెల్లి నర్సిరెడ్డి బరిలో నిలవనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న ఆయనను 2025 మార్చిలో జరగనున్న ఎన్నికల్లో నిలపాలని TSUTF రాష్ట్ర కమిటీ సమావేశం ఏకగ్రీవంగా నిర్ణయించింది. వర్చువల్‌గా నిర్వహించిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో సభ్యులు ఆమోదించారు.