News February 4, 2025
NLG: చికెన్ ముక్క కోసం పంచాయితీ

చికెన్ ముక్క రెండు గ్రామాల మధ్య వివాదానికి తెరలేపింది. స్థానికుల వివరాలు.. మేళ్లచెరువులోని ఓ చికెన్ దుకాణంలో మరో గ్రామానికి చెందిన వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. చికెన్ ముక్క కోరిన విధంగా ఇవ్వలేదని ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. షాపు నిర్వాహకుడిపై బాధితుడి తరఫు బంధువులు దాడి చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య పంచాయితీ మొదలై పెద్ద మనుషుల జోక్యంతో చికెన్ షాప్ యజమానికి జరిమానా విధించారు.
Similar News
News January 9, 2026
ALERT: మీ బండి పొగ కక్కుతోందా?

రోడ్లపై మితిమీరిన పొగ కక్కే వాహనాలతో వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ఫిట్నెస్ లేని వాహనాలతో గాలి కలుషితం చేస్తే MV యాక్ట్ 2019 ప్రకారం కఠిన చర్యలు తప్పవు. మొదటిసారి నిబంధనలు అతిక్రమిస్తే ₹10,000 వరకు జరిమానా లేదా మూడు నెలల జైలు శిక్షతో పాటు లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంది. రెండోసారి తప్పు చేస్తే శిక్షా కాలం ఆరు నెలలకు పెరుగుతుంది. మీ వద్ద ఇలాంటి వాహనాలుంటే రిపేర్ చేయించుకొని రోడ్డెక్కండి. share it
News January 9, 2026
బీర సాగులో విత్తనశుద్ధి, ఎరువుల మోతాదు

కిలో విత్తనానికి థైరమ్ 3 గ్రా., ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా. చొప్పున ఒక దాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 100గ్రా. విత్తనానికి 2గ్రా. ట్రైకోడెర్మావిరిడేతో విత్తనశుద్ధి చేయాలి. విత్తడానికి ముందు ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు 32-40 కిలోల భాస్వరం, 16- 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు, పూత పిందె దశలో వేసుకోవాలి.
News January 9, 2026
నల్గొండ: ఆర్టీసీ సేవలు.. బస్సులు ఎన్నంటే..?

నల్గొండ రీజియన్ పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 9 నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని ఆర్ఎం కె.జాన్ రెడ్డి తెలిపారు. మొత్తం 298 ప్రత్యేక బస్సులు నడుస్తాయని చెప్పారు. నల్గొండ 36, మిర్యాలగూడ 44, దేవరకొండ 62, నార్కట్పల్లి 42, సూర్యాపేట 28, కోదాడ 42, యాదగిరిగుట్టకు 44 బస్సులు కేటాయించినట్లు తెలిపారు. రద్దీని బట్టి మరిన్ని బస్సు సర్వీసులను పెంచుతామని ఆయన పేర్కొన్నారు.


