News February 4, 2025
NLG: చికెన్ ముక్క కోసం పంచాయితీ

చికెన్ ముక్క రెండు గ్రామాల మధ్య వివాదానికి తెరలేపింది. స్థానికుల వివరాలు.. మేళ్లచెరువులోని ఓ చికెన్ దుకాణంలో మరో గ్రామానికి చెందిన వ్యక్తి చికెన్ కొనుగోలు చేశాడు. చికెన్ ముక్క కోరిన విధంగా ఇవ్వలేదని ప్రశ్నించగా షాపు నిర్వాహకుడు దాడి చేశాడు. షాపు నిర్వాహకుడిపై బాధితుడి తరఫు బంధువులు దాడి చేశారు. దీంతో 2 గ్రామాల మధ్య పంచాయితీ మొదలై పెద్ద మనుషుల జోక్యంతో చికెన్ షాప్ యజమానికి జరిమానా విధించారు.
Similar News
News February 16, 2025
రూ.62కోట్ల నష్టం తెచ్చిపెట్టిన ఎక్స్‌ప్రెస్

సాధారణంగా రైళ్లలో చాలా రద్దీ ఉంటుంది. సీటు దొరకడమే కష్టం. అయితే ఢిల్లీ-లక్నో, అహ్మదాబాద్-ముంబై మార్గాల్లో నడిచే తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల కొరతతో ఇబ్బంది పడుతోంది. గత మూడేళ్లుగా ఈ ట్రైన్ వల్ల రైల్వేశాఖకు రూ.62.88 కోట్ల నష్టం వచ్చింది. దీంతో దీని నిర్వహణ బాధ్యతను రైల్వే IRCTCకి అప్పగించింది. అయినప్పటికీ తగినంతగా ప్యాసింజర్‌లు లేక నష్టాల మార్గంలో ప్రయాణిస్తోంది.
News February 16, 2025
రామతీర్థంలో 26 నుంచి శివరాత్రి జాతర

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో ఈ నెల 26వ తేదీ నుంచి మూడురోజుల పాటు శివరాత్రి జాతర మహోత్సవం జరగనుంది. 26, 27 తేదీల్లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు జాగరణ చేస్తారు. 28న వేద పారాయణం అనంతరం స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం జరిపిస్తారు. జాతరకు ఉత్తరాంధ్ర నుంచి సుమారు 5 లక్షల మంది భక్తులు విచ్చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
News February 16, 2025
ఐఏఎస్ అయ్యి సేవ చేస్తా: జైకిసాన్

అల్లూరి జిల్లా వై.రామవరం మండలం కోట గ్రామానికి చెందిన కె.జైకిసాన్ JEE మెయిన్స్‌లో సత్తా చాటాడు. ఈ గిరిజన విద్యార్థి 97 పర్సంటైల్ స్కోర్‌తో ఎస్‌టి విభాగంలో జాతీయ స్థాయి ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నాడు. ఐఏఎస్ అయ్యి గిరిజన గ్రామాల్లో సేవ చేయాలన్నదే తన ఆశయమని తెలిపాడు. జైకిసాన్ తండ్రి లక్ష్మణరావు రంపచోడవరం మండల అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. ఆయనను పలువురు అభినందించారు.