News February 3, 2025
NLG: చేనేత కళాకారుల జీవన విధానంపై సినిమా

పోచంపల్లి చేనేత కళాకారుల జీవన విధానంపై ఓ సినిమా రూపొందుతోంది. చౌటుప్పల్‌కి చెందిన వ్యాపారవేత్త ధనుంజయ నిర్మాతగా, పోచంపల్లికి చెందిన బడుగు విజయకుమార్ దర్శకత్వంలో ది అవార్డ్ 1996 అనే సినిమా తీస్తున్నారు. నిర్మాత సురేశ్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేసినట్లు ధనుంజయ తెలిపారు. ఈ సినిమా మొత్తం గ్రామాల్లో చేనేత కళాకారుల జీవన విధానం, వారు దళారుల చేతిలో ఎలా మోసపోతున్నారో తెలిపే విధంగా ఉంటుందన్నారు.
Similar News
News February 14, 2025
మర్రిగూడ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్‌ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
News February 14, 2025
నల్గొండ: MGU ఇంగ్లిష్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్‌గా అరుణ ప్రియ

MG యూనివర్సిటీ ఆంగ్ల విభాగం అధ్యాపకురాలు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కే.అరుణ ప్రియను ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్‌గా నియమిస్తూ రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది పాటు సేవలు అందించనున్న అరుణ ప్రియ ఆంగ్ల భాషలో నైపుణ్యాలు పెంపొందించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించనున్నారు.
News February 14, 2025
UPDATE: అక్కంపల్లి రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లు

పీఏపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో మృతి చెందిన కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు పడేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రిజర్వాయర్‌ను దేవరకొండ RDO రమణారెడ్డి పరిశీలించారు. రిజర్వాయర్ వెనక జలాలలో దాదాపు 80 కోళ్లు లభ్యం అయ్యాయి. రిజర్వాయర్‌లో కోళ్లను ఎవరు పడేసి ఉంటారో అనే కోణంలో విచారణ చేపడుతున్నామని ఆర్డీఓ చెప్పారు. ఈ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు.