News December 31, 2024
NLG: జనవరి 18కి పరీక్ష వాయిదా

NLG జిల్లా న్యాయసేవాధికార సంస్థలో టైపిస్ట్ /అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగాలకై నిర్వహించాల్సిన రాత పరీక్ష జనవరి 4 నుంచి జనవరి 18కి వాయిదా వేసినట్లు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. OMR పద్ధతిలో రాతపరీక్ష షెడ్యూల్ (రికార్డు అసిస్టెంట్: జనవరి 18 ఉదయం గం. 11.00 నుంచి 12.30 వరకు, టైపిస్ట్ /అసిస్టెంట్ జనవరి 18 మధ్యాహ్నం గం. 3.00 నుంచి 3.40 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Similar News
News November 15, 2025
నాగార్జునసాగర్ ఆసుపత్రిలో చిన్నారులకు అస్వస్థత

సాగర్లోని కమల నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 17 మంది చిన్నారులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారికి గ్లూకోజ్, ఇంజెక్షన్లు ఇచ్చాక ఒక్కసారిగా చలి, జ్వరం, వాంతులు వచ్చాయని బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. వారికి ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
News November 15, 2025
NLG: పేరుకే జిల్లా ఆస్పత్రి.. HYD వెళ్లాల్సిందే..

నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో మెదడు, ఇతర ప్రధాన అవయవాలకు గాయాలైనప్పుడు ఎంఆర్ఐ స్కాన్, స్పెషలిస్టుల చికిత్స తప్పనిసరి. ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ ఉన్నప్పటికీ, స్పెషలిస్టులు లేకపోవడంతో ఎమర్జెన్సీ కేసులకు సైతం ప్రాథమిక చికిత్స అందించి వైద్యం కోసం HYD పంపించాల్సిన దుస్థితి నెలకొంది.
News November 15, 2025
NLG: ర్యాగింగ్పై కఠిన చర్యలకు కలెక్టర్ ఆదేశం

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇటీవల సంభవించిన ర్యాగింగ్ సంఘటనలపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధ్యక్షతన యాంటీ-ర్యాగింగ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ర్యాగింగ్ ఉదంతాలపై సమగ్రంగా చర్చించిన కమిటీ.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఏమాత్రం పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన కఠిన చర్యలపై నిర్ణయం తీసుకుంది.


