News September 5, 2024
NLG: జిల్లాలో ఉత్తమ గురువులు@130 మంది
జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న 130 మంది ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ జిల్లా స్థాయి ఉత్తమ గురువులుగా ఎంపిక చేసింది. ఉత్తమ బోధనతోపాటు ఇతర సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆదర్శంగా నిలిచినందుకు వీరు ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించనున్నారు.
Similar News
News September 20, 2024
సూర్యాపేట: గణపతి లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు
సూర్యాపేట జిల్లా యాతవాకిళ్లలో ముస్లిం దంపతులు షేక్ దస్తగిరి – సైదాబీ మత సామరస్యం చాటుకున్నారు. శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ ఆధ్వర్యంలోని శ్రీ గణేశ్ మహారాజ్ లడ్డూని రూ.29,000 వేలకు కైవసం చేసుకున్నారు. భారీ ఊరిగేంపుతో లడ్డూను దస్తగిరి ఇంటికి తరలించారు. దస్తగిరి – సైదాబీ దంపతులను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఛత్రపతి శివాజీ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News September 19, 2024
దేవరకొండ: ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం
నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైనట్లు సీఐ నరసింహులు తెలిపారు. పాఠశాల గోడ దూకి పారిపోయిన విద్యార్థులు బుధవారం అర్ధరాత్రి చింతపల్లి మండలం మాల్ పట్టణంలో పోలీసులకు దొరికినట్టు తెలిపారు. విద్యార్థులను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
News September 19, 2024
నల్గొండ: వృద్ధురాలిపై అత్యాచారం.. కేసు నమోదు
నల్గొండకి చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలిని హిందూపూర్ స్మశాన వాటిక వద్ద కందుల కృష్ణ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున అత్యాచారం చేశాడని వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ తెలిపారు. విషయం ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడని తెలిపారు. బాధితురాలు కూతురితో విషయం చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.