News March 18, 2025
NLG: జిల్లాలో పుంజుకున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియ

నల్గొండ జిల్లా వ్యాప్తంగా లేఅవుట్ రెగ్యులర్ రెగ్యులేషన్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించినందుకు గత ప్రభుత్వం 2020 ఆగస్టులో ఎల్ఆర్ఎస్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. మార్చి 31 లోగా రెగ్యులరైజ్ చేసుకుంటే ఫీజులు 25% రాయితీ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ వేగవంతమైంది.
Similar News
News April 20, 2025
NLG: మన పనుల్లో ఉత్తరాది కూలీలు..!

ఉమ్మడి NLG జిల్లాలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కార్మికులు గణనీయంగా పెరిగారు. ప్రతి రంగంలో వారి ఉనికి కనిపిస్తోంది. సుమారు 6వేల మంది వరకు కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నట్లు అంచనా. హోటళ్లలో కార్మికులుగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. వ్యవసాయం, నిర్మాణ రంగం, ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, టైల్స్, కార్పెంటర్ కార్మికులుగా బీహార్, UP, ఢిల్లీ వాళ్లు పని చేస్తున్నారు.
News April 20, 2025
కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

కార్పొరేట్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 30లోగా దరఖాస్తు చేసుకోవాలని నల్గొండ సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు ప్రేమ్ కరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నత ప్రమాణాలతో బోధన సాగిస్తూ కాంపిటిటీవ్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో ఉత్తీర్ణత సాధిస్తున్న కళాశాలలకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
News April 20, 2025
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 21,120, ఎస్టీ కార్పొరేషన్‌కు 11,515, బీసీ కార్పొరేషన్‌కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 253 దరఖాస్తులు వచ్చాయి.