News November 18, 2024
NLG: జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
NLG జిల్లాలో రోజురోజుకి చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. గత మూడు రోజుల క్రితం 27 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా 20 డిగ్రీలకు పడిపోయింది. దీంతో ఉదయం 8 గంటల వరకు ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకు రావడం లేదు. వృద్ధులు చలి తీవ్రతకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల సమయం దాటిందంటే చాలు చలి మొదలవుతుందని స్థానికులు తెలిపారు.
Similar News
News December 4, 2024
నడిగూడెం: బంతి తోట.. లాభాల పంట
బంతి తోట సాగుతో మంచి లాభాలు వచ్చాయని బంతితోట సాగు రైతు మేకపోతుల వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. మండలంలోని బృందావనపురం గ్రామానికి చెందిన రైతు నడిగూడెం నుంచి రామచంద్రపురం వెళ్లే ప్రధాన రహదారి పక్కన తనకున్న వ్యవసాయ భూమిలో కొంత 0.50 సెంట్లలో బంతితోట సాగు చేశారు.కింటాకు రూ.5,000 – 6000 ధర పలుకుతుందని తెలిపారు. బంతి తోట సాగు చేయాలని నిర్ణయించుకొని వరికి బదులుగా బంతితోట సాగు చేయటంతో లాభసాటిగా ఉందన్నారు.
News December 4, 2024
NLG: రేపటి నుంచి డీఈఈ సెట్ సర్టిఫికెట్ల పరిశీలన
డీఈఈ సెట్ 2024 సెకండ్ ఫేజ్ సర్టిఫికెట్ల పరిశీలన గురువారం నుంచి ప్రారంభమవుతుందని NLG డైట్ కళాశాల ప్రిన్సిపల్ కె.నర్సింహ ఓ ప్రకటనలో తెలిపారు. NLG డైట్ కళాశాలలో 5న సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. 7 నుంచి 9 వరకు ర్యాంకుల ప్రకారం వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, 13వ తేదీన సీట్ల కేటాయించనున్నామని తెలిపారు. సీటు పొందిన వారు 13 నుంచి 17వ తేదీ వరకు కాలేజీలో రిపోర్టు చేయాలన్నారు.
News December 4, 2024
BREAKING: ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూకంపం
ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో స్వల్ప భూకంపం సంభవించింది. సూర్యాపేట, అంజనపురి కాలనీ, మునగాల, నకిరేకల్, చౌటుప్పల్, మిర్యాలగూడ, కొదాడ, ఏన్కూర్, భువనగిరి, ఆత్మకూరు, సిరికొండ, పానగల్, తిరుమలగిరి పలు చోట్ల భూమి కంపించింది. ఉదయం 7:30 గంటలకు 3 సెకన్ల కంపించినట్లు తెలుస్తోంది. భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మీ ప్రాంతంలోనూ భూమి కంపించిందా? కామెంట్ చేయండి.