News January 3, 2025
NLG: జిల్లాలో మళ్లీ పెరిగిన చలి
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మళ్లీ చలి తీవ్రత పెరిగింది. అల్పపీడన ప్రభావంతో గడిచిన పది రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గురు, శుక్రవారాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో కనిష్ట ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో పల్లెలతో పాటు పట్టణాల్లో చిన్నారులు, వృద్ధులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News January 8, 2025
NLG: గురుకులాల్లో అడ్మిషన్లు.. మిస్ చేసుకోకండి
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.
News January 8, 2025
AMAZING: తాజ్మహల్లో నల్గొండ రాళ్లు!
తాజ్మహల్ నిర్మాణంలో NLG జిల్లా దేవరకొండ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్ లైబ్రరీ& రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.
News January 8, 2025
దేవరకొండ: శిశువు మృతి.. బంధువుల ఆందోళన
దేవరకొండ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిచెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దేవరకొండ మం. మర్రిచెట్టు తండాకు చెందిన ఓ గర్భిణి మంగళవారం మధ్యాహ్నం ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు సాధారణ ప్రసవం కోసం వేచి ఉంచి ఈరోజు తెల్లవారుజామున డెలివరీ చేశారు. కాగా శిశువు మృతిచెందడంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబీకులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.