News July 16, 2024

NLG: జిల్లాలో 3 మిల్లీమీటర్ల సగటు వర్షం

image

నల్గొండ జిల్లాలో 3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలో అత్యధికంగా CTL మండలంలో 18.2 మిల్లీమీటర్లు, అత్యల్పంగా అనుములలో 0.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. SLGలో 15.5, NKPలో 15.1, మర్రిగూడ 6.9, గట్టుప్పల్ 4.5, KTGR 4.3, చింతపల్లి 3.5, CDR 3.3, NLG 2.8, మునుగోడు 2.6, తిప్పర్తి 2.3, గుండ్లపల్లి 2.2, గుర్రంపోడు 1.8 మీ.మీ వర్షం పడింది.

Similar News

News October 11, 2024

నల్గొండ: తెల్లబోతున్న పత్తి రైతులు..!

image

పత్తికి సరైన ధర దక్కక రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా పెట్టుబడి బారం, సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో సరిగా వర్షాలు పడక.. కాలం కలిసి రాక దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుంది. వచ్చిన ఆ కొద్ది పాటి పంటను తీసుకుందామంటే వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి తడిచి చేనులోనే మొలకలు వస్తు న్నాయి. క్వింట పత్తి మొదట రూ.7000 -8000 ఉండగా.. ప్రస్తుతం రూ.5000-6000 కే పరిమితం అయింది.

News October 11, 2024

నల్గొండ: 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులకు టీచర్ ఉద్యోగాలు

image

డీఎస్సీ -2024 పరీక్ష ఫలితాలు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది. నల్గొండ జిల్లాలోని 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఉద్యోగాలు చేస్తూ డీఎస్సీ-2024కు ఎంపికయ్యారు. గ్రామపంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో పారిశుద్ధ్య, నీటి సరఫరా, మొక్కల పెంపకం, ధ్రువీకరణ పత్రాలు, వీధి దీపాల నిర్వహణ చేసేవారు. ఎంపికైన 11 మంది గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇకపై విద్యార్థులకు బడిలో పాఠాలు చెప్పనున్నారు.

News October 11, 2024

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్‌కు ఆదేశాలు రాలేదు: డీఈఓ బిక్షపతి

image

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్ విషయంపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అని డీఈఓ బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు తమ వద్ద రిపోర్టు చేస్తున్నారు. గురు, శుక్రవారాలు ఉపాధ్యాయుల రిపోర్టింగ్కు కు అవకాశం ఇచ్చాం అని అన్నారు. దసరాకు ముందు పోస్టింగ్ లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దసరా తర్వాతే కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తాం అని పేర్కొన్నారు.