News November 16, 2024

NLG: జిల్లాలో 55% సర్వే పూర్తి

image

నల్గొండ జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే ముమ్మరంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అధికారులు 5,03,500 కుటుంబాలను గుర్తించారు. ఇప్పటివరకు దాదాపుగా మూడు లక్షల గృహాల్లో ఎన్యూమరేటర్లు సర్వే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలతో పోలిస్తే నల్గొండ జిల్లా రెండో స్థానంలో నిలిచినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో సర్వే వేగంగా ఇప్పటికే 55 శాతం పూర్తి అయినట్లు అధికారులు తెలిపారు.

Similar News

News December 11, 2024

NLG: పల్లె పోరుకు ముమ్మర ఏర్పాట్లు

image

ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తేదీ ఎప్పుడు ప్రకటించినా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఓటరు జాబితా పూర్తి చేయడంతోపాటు పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. బ్యాలెట్ బాక్సులు, సామగ్రి సిద్ధం చేసి పెట్టుకున్నారు. నల్లగొండలో 856, యాదాద్రి భువనగిరిలో 428, సూర్యాపేటలో 486 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తుంది.

News December 11, 2024

రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటి..?

image

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మౌనానికి అర్థం ఏమిటనే సర్వత్రా చర్చ సాగుతుంది. వలిగొండలో సీఎం చేపట్టిన మూసీ ప్రక్షాళన యాత్రలో ఆయన కనిపించలేదు.  నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న విజయోత్సవ సభకు సైతం డుమ్మా కొట్టారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే అధిష్టానం సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి.. అది నేటికి కార్యరూపం దాల్చకపోవడంతో ఆయన సైలెంట్‌గా ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

News December 11, 2024

వేగుచుక్క.. నాగార్జునసాగర్

image

కరవుకాటకాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వేగుచుక్కలా నిలిచింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు. 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. NLG జిల్లా నందికొండ వద్ద కృష్ణ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా సాగర్ ప్రసిద్ధి చెందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.