News February 1, 2025

NLG: జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

image

WGL- KMM- NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడంతో పాటు,  ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరగదని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు ఇచ్చేందుకు రావద్దని సూచించారు.

Similar News

News April 14, 2026

నార్కట్‌పల్లి: కారులో చిక్కుకుని ఐదేళ్ల చిన్నారి మృతి

image

నార్కట్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ఇంటి ముందున్న కారులోకి వెళ్లిన పేర్ని చరణ్య (5) ఊపిరాడక స్పృహ కోల్పోయింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కామినేని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్ఐ విష్ణుమూర్తి ఆస్పత్రికి చేరుకుని తల్లి గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దేవరకొండ: పరారీలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగి మంతనాలు!

image

దేవరకొండలోని ఓ జాతీయ బ్యాంకులో ఖాతాదారుల సొమ్ము కాజేసి పరారైన కాంట్రాక్టు ఉద్యోగి, రాష్ట్ర ఉద్యోగ సంఘ నేతతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఉద్యోగుల ఐడీలతో నిధులు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బ్యాంకు అధికారులు మాత్రం సొమ్ము భద్రంగానే ఉందని తెలిపారు. రహస్యంగా దర్యాప్తు చేస్తూ, సదరు ఉద్యోగిని పట్టుకుని మిగిలిన సిబ్బందిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.