News June 15, 2024

NLG: జీతాలు అందక అంగన్వాడీల అవస్థలు..!

image

ఉమ్మడి జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న కార్యకర్తలు, ఆయాలకు రెగ్యులర్గా వేతనాలు అందకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వీరికి ప్రతినెలా 14వ తేదీన జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. గత కొన్ని నెలలుగా టైంకు జీతాలు చెల్లించకపోవడంతో అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతినెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కోరుతున్నారు.

Similar News

News September 18, 2024

‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి’

image

రానున్న వానకాలం ధాన్యం కొనుగోలుకు అవసరమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ప్రతిపాదనలు సమర్పించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. మంగళవారం ఆయన తన చాంబర్లో వానకాలం ధాన్యం కనీస మద్దతు ధర నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ధాన్యం కొనుగోలుకు గాను జిల్లా వ్యాప్తంగా 400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

News September 17, 2024

ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి

image

నల్గొండ పట్టణంలోని పోలీస్ గ్రౌండ్‌లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంలో రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాను మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బాల బాలికల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ పవర్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలునాయక్ తదితరులున్నారు.

News September 17, 2024

నాగార్జునసాగర్ జలాశయం తాజా సమాచారం

image

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వరద స్వల్పంగా పెరింది. 2 గేట్లు 8 అడుగుల మేరకు ఎత్తి 24,884 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్‌కు ఇన్ ఫ్లో 68,327 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 22,366 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 589.90 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 311.7462 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.