News March 28, 2025
NLG: జీపీఓ పోస్టుల భర్తీకి కసరత్తు

గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పటిష్ఠానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రజలకు రెవెన్యూ సేవలు అందించేలా గ్రామ పాలనాధికారి పేరుతో ఉద్యోగులను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంది 370 మంది జీపీఓ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో.. ఎంత మందిని నియమిస్తారనేది ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు.
Similar News
News April 4, 2025
NLG: పారితోషికం కోసం ఎదురుచూపు

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పారితోషికం అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 3000 మందికి పైగానే డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి పారితో కింద ఒక్కో ఫామ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినందుకు రూ.25 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ నేటి వరకు పారితోషికం అందించలేదని ఆపరేటర్లు తెలిపారు.
News April 4, 2025
NLG: అగ్రిగోల్డ్ మోసానికి పదేళ్లు

ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట దక్కడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 2015లో కేసులు నమోదు చేశారు. జిల్లాలో సుమారు వేల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఉన్నారు. సుమారు 10 ఏళ్లు కావస్తున్నా.. బాధితులకు నేటికీ చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
News April 4, 2025
NLG: జిల్లాలో మామిడికి గడ్డు పరిస్థితులు!

ఉద్యాన పంటల్లో ఫలరాజంగా ప్రసిద్ధి చెందిన మామిడికి ఈ ఏడాది గడ్డు పరిస్థితులు దాపురించాయి. గతేడాది సకాలంలో వర్షాలు కురియక, ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా పూత సకాలంలో రాలేదు. వచ్చిన పూత కూడా నిలవకుండా మాడిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో దట్టంగా కురిసిన పొగమంచు పూతను దెబ్బతీసిందని రైతులు తెలిపారు. ఈ ఏడాది కనీసం 1 నుంచి 2 టన్నుల వరకైనా దిగుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు అంటున్నారు.