News March 18, 2025
NLG: జూనియర్ కాలేజీల్లో బోధన కష్టాలు గట్టెక్కినట్టే!

నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్ల కొరత తీరనున్నది. గత 13 ఏళ్లుగా పూర్తిస్థాయి అధ్యాపకులు లేక జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బోధన అంతంత మాత్రంగానే సాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నియామకాలు చేపట్టడంతో జిల్లాకు సుమారు 50 మంది వరకు కొత్త అధ్యాపకులు రానున్నట్లు సమాచారం. దీంతో అధ్యాపకుల కొరత తీరనుండడంతో బోధన కష్టాలు ఇక గట్టెక్కనున్నాయి.
Similar News
News November 12, 2025
నల్గొండకు మరో అరుదైన గౌరవం

ప్రాంతీయ అభివృద్ధికి సైన్స్ అండ్ టెక్నాలజీ (S&T) ఆధారిత పరిష్కారాలను రూపొందించడంలో చురుకుగా ఉన్న నల్గొండ జిల్లా యంత్రాంగానికి అరుదైన ఆహ్వానం లభించింది. కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు (PSA) కార్యాలయం ఢిల్లీలో డిసెంబర్లో నిర్వహించే అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. ‘S&T క్లస్టర్స్: మేకింగ్ లైవ్స్ ఈజియర్’ అంశంపై జరిగే ఈ సదస్సు ఆహ్వానం కలెక్టర్కు అందింది.
News November 12, 2025
NLG: ఆ సంచి ప్రచారానికేనా..!

రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న ప్లాస్టిక్ రహిత సంచులు ప్రచారానికే తప్ప బియ్యం తీసుకెళ్లేందుకు పనికిరావడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సంచుల కొలతలు, పోర్టబిలిటీ, బయోమెట్రిక్ నిబంధనలపై రేషన్ డీలర్లు, కార్డుదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,66,100 రేషన్ కార్డులు ఉన్నాయి. అయితే ఈ సంచులు కేవలం 12 కిలోల బియ్యం మాత్రమే తీసుకెళ్లేలా రూపొందించారు.
News November 12, 2025
NLG: ఆశల సాగులో రైతన్న.. యాసంగికి సిద్ధం

ఆశల సాగులో రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు. ఒకసారి కాకుంటే మరో సారి కాలం కలిసి రాదా అనే ఆశతో నల్గొండ జిల్లాలో రైతన్న యాసంగి సాగుకు సిద్ధమవుతున్నాడు. వానకాలంలో అధిక వర్షాలు నిండా ముంచాయి. పత్తి, వరి తదితర పంటలు దెబ్బతిని రైతులు నష్టాలు చవిచూశారు. వానకాలం నష్టాలు మిగిల్చినా యాసంగికైనా కలిసొస్తుందేమో అనే ఆశతో సాగుకు సన్నద్ధమవుతున్నాడు.


