News September 30, 2024

NLG: టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు నమోదు

image

NLG- KMM- WGL టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నవంబర్ 6వ తేదీ వరకు కొనసాగనుందని అధికారులు తెలిపారు. నవంబర్ 23వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటిస్తామన్నారు. అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత డిసెంబర్ 30వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు చెప్పారు.

Similar News

News October 10, 2024

NLG: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి: మంత్రి

image

క్రీడా రంగంలో తెలంగాణను దేశంలోనే ముందు ఉంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్జీ కళాశాల మైదానంలో నిర్వహించిన ఖేలో ఇండియా ఉమెన్ కోకో రాష్ట్ర ట్రాయాల్స్ సెలక్షన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలన్నారు.

News October 9, 2024

MLG: ఒకే ఏడాదిలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

image

ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైన ఈరోజుల్లో మిర్యాలగూడ మండలం జాలుబావి తండాకు చెందిన భూక్యా సేవా రాథోడ్ ఒకే ఏడాదిలో ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సత్తా చాటాడు. ఇటీవల వెల్లడించిన DSC ఫలితాలలో SA, తెలుగు 8 ర్యాంక్‌తో పాటు SGT ఉద్యోగం సాధించారు. గతంలో గురుకుల జేఎల్ (13 ర్యాంక్), పిజిటి (8 ర్యాంక్), TGT, TSPSC జూనియర్ లెక్చరర్ 13 ర్యాంక్ ఉద్యోగాలు సాధించారు. నేడు సీఎంతో నియామక పత్రం అందుకున్నారు.

News October 9, 2024

మిర్యాలగూడ: టీచర్ అయిన రిక్షావాలా కొడుకు

image

మిర్యాలగూడ పట్టణం రవీంద్రనగర్ కాలనీకి చెందిన ముడావత్ గణేశ్ డీఎస్సీ – 2024 ఫలితాల్లో ఎస్టీ విభాగంలో ఎస్జీటీ ఉద్యోగం సాధించాడు. తండ్రి మూడావత్ పంతులు రిక్షా తొక్కుతూ, తల్లి పండ్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి నలుగురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు సంతానం. చిన్న కుమారుడు గణేశ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.