News August 17, 2024

NLG: టెక్స్టైల్స్ డిప్లమో ప్రవేశాలపై అవగాహన

image

చేనేత, టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు నల్గొండ జిల్లా చేనేత సహయ సంచాలకుడు ద్వారక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉండి.. పదో తరగతి ఉత్తీర్ణులైన 25 ఏళ్లలోపు అభ్యర్ధులు ఈనెల 31లోపు జిల్లా చేనేత కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News September 17, 2024

నేడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కోమటిరెడ్డి

image

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారని, అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి సందేశం ఇస్తారని తెలిపారు.

News September 16, 2024

రూ.13.50 లక్షలు పలికిన నల్గొండ పాతబస్తీ లడ్డూ

image

నల్గొండ పాతబస్తీ హనుమాన్ నగర్ ఒకటో నంబర్ వినాయక లడ్డూ రూ.13.50 లక్షల వేలం పలికింది. బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వినాయక లడ్డూను కైవసం చేసుకున్నారు. కాగా గతేడాది పాతబస్తీ ఒకటో నంబర్ వినాయక లడ్డూ వేలం రూ.36 లక్షలు పలికింది.

News September 16, 2024

ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలతో ఆదివారం భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో జిల్లా రాజకీయాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, భూపాల్ రెడ్డి, బిక్షమయ్య గౌడ్, గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్, చిరుమర్తి లింగయ్య, భాస్కరరావు, రవీంద్ర కుమార్ పాల్గొన్నారు.