News March 29, 2024

NLG: టెట్‌పై గురి.. అర్హత సాధించేందుకు..

image

ఉమ్మడి జిల్లాలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష పై యువత గురి పెట్టింది. ఉమ్మడి జిల్లాలోని డీఎడ్, బీఎడ్ అభ్యసించి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణత సాధించేందుకు వేలాదిమంది నిరుద్యోగులు ప్రయత్నిస్తున్నారు. గత సెప్టెంబర్లో నిర్వహించిన టెట్ పరీక్షకు మొత్తం 43,681 మంది దరఖాస్తు చేసుకోగా.. 36, l919 మంది హాజరయ్యారు. అందులో పేపర్-1 కు 18,174 మంది, పేపర్-2కు 18,745 మంది టెట్ పరీక్ష రాశారు.

Similar News

News January 18, 2025

NLG: రేషన్ కార్డు లేని కుటుంబాలు 27,527

image

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. రేషన్ కార్డుల సర్వేపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. కులగణన సర్వే రిపోర్టు ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ప్రభుత్వం రాష్ట్రస్థాయిలో తయారు చేసిందని తెలిపారు. జిల్లాల్లో 27,527 రేషన్ కార్డుల లేని కుటుంబాలు ఉన్నట్లు లెక్క తేలిందని తెలిపారు.

News January 18, 2025

NLG: నేడు జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి జిల్లాలో జవహర్ నవోదయ (ఆరో తరగతి) ప్రవేశ పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 27 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. NLG జిల్లాలో 13, BNGలో 5, SRPT జిల్లాలో 9 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉన్నాయనీ ప్రిన్సిపాల్ నాగభూషణం తెలిపారు. 80 సీట్లలో 75% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు.

News January 18, 2025

ఈ నెల 21న నల్గొండకు కేటీఆర్

image

నల్గొండకు ఈ నెల 21 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రైతు మహాసభలో పాల్గొననున్నారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పార్టీ నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ ఓటమి తరువాత నల్గొండ టౌన్‌కు కేటీఆర్ రావడం ఇదే మొదటిసారి. కాగా ఈ నెల 13న నిర్వహించాల్సిన రైతు మహాసభ వివిధ కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే.